Kr Vijaya: కె ఆర్ విజయ సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తమిళ నటి అయినప్పటికీ ఈమె మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిగా ఎంతో స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ ఎంతోమంది తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు.ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో హీరోయిన్ గా నటించిన మెప్పించారు.

కె ఆర్ విజయ వయసు పై పడే కొద్ది ఈమె సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ సందడి చేశారు. ముఖ్యంగా ఏదైనా దేవత పాత్రలు చేయాల్సి గనుక వస్తే దర్శక నిర్మాతలకు ముందుగా కె ఆర్ విజయ గుర్తుకు వచ్చేవారు. ఇలా దేవత పాత్రలకు ఈమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇక ఈమె దేవత పాత్రలలో నటించారు అంటే ఆ సినిమాకు మహిళలు క్యూ కట్టేవారు.
దేవత పాత్రలలో అంతగా ఒదిగిపోయి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకునే కె ఆర్ విజయకు భారీ డిమాండ్ ఉండేది. అయితే ఈమె దేవత పాత్రలలో కనుక నటిస్తున్నారు అంటే రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో అందించే వారిని ఓ సందర్భంలో డైరెక్టర్ కోడి రామకృష్ణ వెల్లడించారు.

Kr Vijaya: లక్షల్లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన విజయ..
ఈ క్రమంలోనే ఓ సందర్భంలో ఈయన కేఆర్ విజయ దేవతా పాత్రల గురించి మాట్లాడుతూ ఈమె అలాంటి పాత్రలలో నటించాలంటే లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకునేవారని తెలిపారు. ఈమెకు ఇచ్చే రెమ్యూనరేషన్ తో సగం సినిమా పూర్తి చేయవచ్చని అంత మొత్తంలో ఈమె రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే వారిని తెలియజేశారు. ఇక ఈమె అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చి ఈమెను ఎంపిక చేసుకుంటున్నాము అంటే ఈమె పాత్రకు కూడా అలాంటి ప్రాధాన్యత ఉండేదని కోడి రామకృష్ణ తెలిపారు.































