మీరు కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా… అయితే ఈ బోరు నీళ్లు తాగాల్సిందే..ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా కీళ్ల నొప్పులకు బోరు నీళ్ళుకి సంబంధం ఏమిటి? అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ బోరు నీళ్ల ప్రత్యేకత ఏమిటో మీరు తెలుసుకోవాల్సిందే.. సాధారణంగా వయసు పైబడే కొద్దీ చాలా మంది కీళ్లనొప్పులతో, గ్యాస్ ట్రబుల్ , షుగర్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యలను దూరం చేయడం ఈ బోరు నీళ్ల ప్రత్యేకత అని చెప్పవచ్చు. మరి ఆ బోరు ఎక్కడ ఉందో తెలుసుకుందాం…

కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తీరువూరు ప్రధాన రహదారిపై తెల్లదేవరపల్లి ఓ చేతిపంపు ఉంది. స్థానికంగా ఉండే ప్రజలు కొన్ని సంవత్సరాల నుంచి ఈ చేతి పంపు నుంచి వచ్చే నీటిని తాగుతున్నారు.కేవలం ఈ గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ చేతి పంపు దగ్గరికి చేరుకొని నీళ్లను తీసుకెళ్ళడం విశేషం.
ఈ చేతి పంపు నుంచి వచ్చే నీటిని ప్రతి రోజు ఉదయం తాగితే వారికి ఉన్నటువంటి కీళ్లనొప్పులు,గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు తగ్గడంతో ప్రజలు పెద్దఎత్తున ఈ చేతి పంపు దగ్గరికి వచ్చి నీటిని తీసుకువెళుతుంటారు. ఒక్కసారి ఈ చేతిపంపు నీరుతాగితే మరే ఇతర నీటిని తాగడానికి ఇష్టపడరని స్థానికులు చెబుతున్నారు.
ఇక బెంగళూరు, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు సైతం ఈ చేతిపంపు నీటిని తీసుకువెళుతుంటారని స్థానికులు చెబుతున్నారు. వేసవి కాలంలో అయితే ఈ నీటి కోసం చాలామంది క్యూ కడుతుంటారు. ఈ బోరు నీటిని తాగటం వల్ల మనలో అనారోగ్య సమస్యలు తగ్గిపోవడం వల్లే పెద్ద ఎత్తున ప్రజలు ఈ నీటి కోసం ఇక్కడికి చేరుకుంటారని స్థానికులు చెబుతున్నారు.

































