Krishna & Shobhan Babu : అలనాటి తెలుగు హీరోల్లో ట్రెండ్ ఫాలో అవకుండా సెట్ చేసిన వాళ్లలో కృష్ణ ముందుంటారు. కొత్తదనాన్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన కుటుంబ కథా చిత్రాలు తీసినా, కౌ బాయ్ సినిమాలు తీసినా, గూఢచారి అంటూ వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మల్టీ స్టారర్ సినిమాలను కూడా దాదాపు అందరి హీరోలతో చేశారు. అలా శోభన్ బాబుగారి తో ముందడుగు, మండే గుండెలు అంటూ హిట్స్ ఇచ్చారు వీరిద్దరి ధ్వయం. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం ఇద్దరూ కలిసి సినిమాలో నటించాలనుకొని చివరికి శోభన్ బాబు గారు నిరాకరించడంతో కృష్ణ గారు మాత్రమే సోలో గా సినిమా చేసారు.

ఆ సినిమా తరువాత కలిసి నటించలేదు…
కృష్ణ, శోభన్ బాబు గారు ఎన్నో మల్టీ స్టార్రర్ లలో కలిసి నటించారు. ఇద్దరూ కలిసి నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. వాళ్లిద్దరూ కలిసి మంచి మిత్రులు, మండే గుండెలు, ముందడుగు, కృష్ణార్జునులు, ఇద్దరు దొంగలు, మహా సంగ్రామం సినిమాల్లో నటించారు. అయితే మహా సంగ్రామం సినిమా తరువాత శోభన్ బాబు గారు ఇక మల్టీ స్టారర్ చేయకూడదని అనుకున్నారు. ఆ సినిమాలో శోభన్ బాబు పాత్ర నిడివి కృష్ణ గారి పాత్ర కంటే తక్కువగా ఉందని అభిమానులు గొడవ చేయడంతో ఇకపై మల్టీ స్టారర్ చేయకూడదని శోభన్ బాబు భావించారు.

అయితే కృష్ణ శోభన్ బాబు గారు చాలా సన్నిహితంగా ఉండేవారు. శోభన్ బాబు గారు భూమి పై పెట్టుబడి పెట్టమని పిల్లల భవిష్యత్ బాగుంటుందని చెప్పినా కృష్ణ వినలేదట. సినిమాల్లో పెట్టి చాలా నష్టాలను చూసారుసని శోభన్ బాబు ఎపుడూ తిట్టేవారట కృష్ణ గారిని. ఈ విషయం కృష్ణ గారు స్వయంగా శోభన్ బాబు గారు మరణించినపుడు చెప్పారు. ఇక కృష్ణ గారు కూడా గతేడాది నవంబర్ లో మరణించారు. ఆయన మరణంతో అప్పటి లెజెండ్రీ నటుల శకం ముగిసినట్లయింది.































