Krishnam Raju : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పట్లో ఆరడుగుల రూపంతో హీరోగానే కాకుండా, విలన్ గా, సహాయక పాత్రలలో కూడా నటించి మెప్పించి, గంబీరమైన పాత్రలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో రెబల్ స్టార్ గా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇక కృష్ణంరాజు గారు సెట్లో ఉన్నారంటే అందరికీ పండగేనట, అయనకోసం ఇంటినుండి వచ్చిన భోజనాన్ని కొసరి కొసరి వడ్డించేవారట. అందుకే ఇండస్ట్రీలో ఆయనను ఆయన కుటుంబాన్ని ఆతిథ్యానికి మరో పేరుగా చెప్పుకుంటారు.

ఫుడ్ విషయంలో లైట్ బాయ్ నుండి హీరో వరకు అందరినీ ఒకేలా…
ఆతిథ్యానికి మరో పేరులా ఉండే కృష్ణంరాజు మంచి భోజనం ప్రియుడు. ఆయన భోజనం చేస్తున్నారు అంటే కంచం పూర్తిగా నాన్ వెజ్ వంటలతో నిండి పోవాల్సిందే. ఇక ఆయన నిర్మాణ సంస్థ గోపి కృష్ణ బ్యానర్ లో సినిమా చేస్తున్నారు అంటే సెట్లో ఆయన తినే భోజనం నుండి లైట్ బాయ్ వరకూ అందరూ అదే తినేలా చూసుకొనే వారట. ఇంతలా అందరినీ భోజనం విషయంలో ఒకటిగా చూసే ఆయనకు పులస కూర అంటే చాలా ఇష్టమట.

ఇండస్ట్రీలో కృష్ణంరాజు వారసుడిగా వచ్చిన ప్రభాస్ కూడా ఆతిథ్యం విషయంలో ఏమాత్రం తీసిపోరు. తనతోటి నటీ నటులు ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పుకొచ్చారు. సెట్లో అందరికీ ఇంటి భోజనాన్ని రుచి చూపిస్తారట. ప్రభాస్ తో కలసి నటించిన వాళ్ళు ఆయన గురించి చెబుతూ… ‘ఫుడ్ తో చంపేస్తారండి బాబు’ అని చెప్తుంటారు. అంతలా కృష్ణంరాజు కుటుంబం గురించి ఆతిథ్యం విషయంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు.
































