Krishnam Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో 183 పైగా సినిమాలలో నటించి రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, సహనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో సినిమాలలో నటించిన కృష్ణంరాజు ఇటీవల మృతి చెందారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇటీవల ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావటంతో ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి.

కృష్ణంరాజు మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభాస్ ఎంతగానో అభిమానించే తన పెదనాన్న ఇలా మృత్యువాత పడటంతో శోకంలో మునిగిపోయాడు. అయితే ప్రస్తుతం కృష్ణంరాజు చివరి కోరిక గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి చూడటమే కృష్ణంరాజు ఆఖరి కోరిక అని కొందరు అంటుంటే … ప్రభాస్ పిల్లలతో కలిసి నటించాలన్నది కృష్ణంరాజు ఆఖరి కోరిక అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కృష్ణంరాజు తన ఆఖరి కోరిక గురించి కృష్ణంరాజు వెల్లడించారని తెలుస్తోంది. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగినప్పటికీ.. తన పెదనాన్న ఆఖరి కోరిక మాత్రం తీర్చలేకపోయాడు.

Krishnam Raju: అధికారక లాంచనాలతో అంత్యక్రియలు
ఇదిలా ఉండగా సోమవారం రోజు మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నారు. హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా రాణించిన కృష్ణంరాజు మంచితనానికి మారుపేరుగా నిలిచాడు. అయితే కృష్ణంరాజు గారు ఇలా అకాల మరణం చెందడంతో పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కృష్ణంరాజు మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
































