Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్,బంగార్రాజు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ది వారియర్ చిత్రంలో నటించారు.తెలుగు తమిళ భాషలలో విడుదల అవుతున్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమా జూలై 14వ తేదీ విడుదల కావడంతో ఇప్పటికే తమిళంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరోయిన్ కృతి శెట్టి బిహైండ్‌వుడ్స్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమెను ప్రాంక్‌స్టర్లు ఆషిక్, సారథిరన్ ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఫ్రాంక్ చేస్తూ భారీ ఎత్తున గొడవ పడ్డారు.

కఠినంగా మాట్లాడితే నాకు నచ్చదు…
కృతి శెట్టిని ముందుగా ప్రశ్నలు తాను అడగాలంటే తాను అడగాలని ఇద్దరు గొడవ పడ్డారు. సారథిరన్ ఆషిక్‌పై చెయ్యి చేసుకోవటంతో మరింత ఆందోళనకు గురైంది. ఇలా వీళ్లిద్దరూ గొడవ పడటంతో ఎంతో ఆందోళనకు గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఇది కేవలం ఫ్రాంక్ అని చెప్పి తనను నవ్వించారు. అయినా మీరు ఎందుకు ఏడ్చారు అంటూ తనని ప్రశ్నించగా ఎవరైనా కఠినంగా మాట్లాడితే నాకు నచ్చదు భయం వేస్తుంది అంటూ కృతి శెట్టి చెబుతూ ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
































