Kriti Sanon: కృతి సనన్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఇలా ఈ సినిమాలో కృతి సనన్ గ్లామర్ వలకబోసిన పెద్దగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు ఈ సినిమా అనంతరం నాగచైతన్య సరసన దోచేయ్ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పి బాలీవుడ్ ఇండస్ట్రీలో మకాం వేశారు.

ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే కెరియర్ మొదట్లో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఇక ఇండస్ట్రీలో ఓ నటి నన్ను సాటి మహిళ అని కూడా చూడకుండా దారుణంగా నా ప్రవేట్ పార్ట్స్ పై కామెంట్ చేశారంట తాజాగా ఈమె ఫిలింఫేర్ అవార్డు వేడుకలో భాగంగా తాను ఎదుర్కొన్న బాడీ షేవింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమాల్లో భాగంగా కృతి సనన్ నటించిన మిమి సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా అవార్డు వరించింది.ఈ అవార్డు వేడుకలో భాగంగా తాను బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో ఓ నటి మహిళగా చూడకుండా ఆమెకు హెడ్ లైట్స్ లేవు.. బంపర్ కూడా లేదు..’ అంటూ వెటకారం చేసిందని ఇలా తన ప్రైవేట్ పార్ట్స్ గురించి దారుణమైన కామెంట్స్ చేశారని ఈ సందర్భంగా ఈ విషయాన్ని బయట పెట్టారు.

Kriti Sanon: మహిళ అని కూడా చూడలేదు…
ఇలా ఆరోజు ఎదుర్కొన్న అవమానంతో తాను ఎంతో కసిగా విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని నేడు అగ్రతారగా హెడ్ లైన్స్ లో నిలబడ్డానని ఈ సందర్భంగా కృతి సనన్ గతంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టారు.ఇకపోతే తెలుగులో రెండు సినిమాలకే పరిమితమైన ఈమె తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆది పురుష్ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
































