Kriti Shetty: ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని హీరోయిన్గా గుర్తింపు పొందిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది.

ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల కస్టడీ సినిమాలో నాగచైతన్య సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉండగా సమంత నటించిన ఊ అంటావా మామా ఊ ఊ అంటావా అనే పాట గురించి కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.కస్టడీ సినిమా ప్రమోషన్స్ కోసం గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టికి ” ఊ అంటావా మామా ఊ ఊ అంటావా ” వంటి స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని ప్రశ్న ఎదురవగా…దీంతో కృతి శెట్టి స్పందిస్తూ..అలాంటి పాటలలో చేయనని కచ్చితంగా సమాధానం చెప్పింది. ప్రస్తుతానికైతే అలాంటి పాటలలో నటించే ఆలోచన లేదని తేల్చి చెప్పింది.తనకు అలాంటి పాటల గురించి అవగాహన లేదని, అందువల్ల అలాంటి పాటల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని తెలిపింది.

Kriti Shetty: మనస్ఫూర్తిగా లేదు…
సౌకర్యంగా లేనప్పుడు అలాంటి పాటలలో నటించకపోవటమే మంచిదని తెలిపింది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో మనస్ఫూర్తిగా నటించలేక పోయానని తెలిపింది. మనసుకి ఇష్టం లేని పనులు చేయకపోవడమే మంచిదని తెలిపింది. ఇక ఊ అంటావా మామా ఊ ఊ అంటావా మామా పాటలో సమంత నటన గురించి మాట్లాడుతూ..సమంత ఒక ఫైర్.. తను చాల బాగా డాన్స్ చేసింది అంటూ చెప్పుకొచ్చింది