సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. తమకు సాయం చేయాలంటూ వస్తున్న విజ్ఞప్తులపై వెంటనే స్పందిస్తూ వారికి సాయం అందిస్తుంటారు. అందుకే చాలామంది ఏ కష్టం వచ్చిన వెంటనే స్పందిస్తాడు మంత్రి. ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తాడు. అందుకే ఓ విద్యార్థి తన బాధను వెళ్లగక్కుతూ కేటీఆర్ ను ట్యాగ్ చేశాడు. అందులో అతడు ఏం రాశాడో తెతుసా.. వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఈ రోజు కొన్ని గంటల క్రితం తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో అత్యంత తక్కువ పాస్ పర్సంటేజ్ నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. జనరల్ లో 49 శాతం, ఒకేషనల్ లో కూడా 49 శాతం మాత్రమే పాస్ అయ్యారు.
జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 4,59,242 మంది పరీక్షకు హాజరవ్వగా 2,24,012 మంది మాత్రమే పాస్ అయ్యారు. మొత్తం మీద పాసైన వారి పర్సెంటేజ్ 49 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా.. దీనిపై గణేష్ విద్యార్థి ట్విట్టర్ ఇలా పోస్టు చేశారు. ఇంటర్ లో నాలుగు సబ్జెక్టులతో ఫెయిల్ అయ్యాను. పరీక్ష రాసే సమయంలో ఏం రాసినా పాస్ చేస్తానని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు ఫెయిల్ చేశారని.. దానికి ఎంతో మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.
ఈ క్రమంలో అతడు ట్విట్టర్ లో ‘సార్.. ఏం రాసినా పాస్ చేస్తామని చెపి.. అందర్నీ ఫెయిల్ చేశారు. నేను ఇప్పుడు సూసైడ్ చేసుకోబోతున్నా.. నా ఆత్మహత్యకు కారణం మంత్రి కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి అంటూ ట్వీట్ చేశాడు. అతడి ట్వీట్ ను మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి చేశాడు చేశాడు. దాంతో పాటు తన మార్కుల షీట్ ను కూడా షేర్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. అది ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకునే పనిలో పోలీసులు ఆరా తీస్తున్నారు.































