Kubera Twitter Review : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ సినిమా తాజాగా అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ కలిసి నటించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా చూసినవాళ్లు ట్విట్టర్‌లో ఏమంటున్నారు? ఆ ట్వీట్లు చూస్తే హిట్టు అనిపిస్తోంది.

ధనుష్ గురించి హైప్ :
ప్రీమియర్స్ చూసినవాళ్ల నుంచి మొదట వినిపించే ప్రశంసలు మాత్రం ధనుష్‌కి సంబంధించినవే. బిచ్చగాడిగా కనిపించినా, ప్రభుత్వాన్ని ఢీ కొట్టే దృఢమైన వ్యక్తిగా ధనుష్ అదరగొట్టేశాడట. “ఇలాంటి రోల్‌కి ఇండియాలో ధనుష్ తప్ప ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు” అంటున్నారు. ఆయన నటన చూసి ఒక మెట్టు ఎక్కాడని పేర్కొంటున్నారు.
#Kuberaa – @dhanushkraja Sir, WHAT A PERFORMANCE. TAKE A BOW!!!!!
— Aakashavaani (@TheAakashavaani) June 19, 2025
నాగార్జునకు ఇది కంబ్యాక్ మూవీనా?
తాజాగా విజయాల కోసం ఎదురు చూస్తున్న నాగార్జునకు ఇది పెద్ద హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. CBI ఆఫీసర్ దీపక్ పాత్రలో ఆయన చాలా స్ట్రాంగ్‌గా కనిపించారని, సహజంగా నటించారని ప్రశంసిస్తున్నారు. కెరీర్‌లో ఇది యూనిక్ రోల్‌గా నిలుస్తుందట.
మీస౦ తిప్పుదా౦ ఇ౦క 🔥
— 𝐊𝐢𝐧𝐠𝐕𝐞𝐧𝐤𝐲 (@KingVenkyBAF) June 19, 2025
The King Is Back with a Bang 💥🔥
Another Blockbuster for King 🔥
King @iamnagarjuna 😎🔥#Kuberaa #BlockbusterKuberaa pic.twitter.com/CxGqHvXvaX
రష్మిక, సంగీతం, ఎమోషన్ – సినిమాకు బలమైన అస్త్రాలు:
రష్మిక తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు ఆడియన్స్‌ని తడిపేశాయట. “ఈ సీన్ల కోసమే సినిమా మరోసారి చూడొచ్చు” అంటున్నారు కొంత మంది.
#Kuberaa – The second half has at least 4-5 emotional scenes which are worth the ticket price. Everything else is a bonus.
— Aakashavaani (@TheAakashavaani) June 19, 2025
Dhanush is going to get a lot of awards. Nagarjuna will earn a lot of respect for agreeing to do his role in the film. Rashmika did yet another memorable…
నెగటివ్ పాయింట్స్ ఏంటంటే..
సినిమా ఆరంభంలో కొద్దిగా నెమ్మదిగా సాగుతుందని ట్వీట్లు చెబుతున్నాయి. కానీ ధనుష్ ఎంట్రీ తర్వాతే సినిమా స్పీడ్ పెరిగిందని, కథ ఒక్క లైన్‌ను నమ్ముకొని నిజాయతీగా తీసిన చిత్రం అనిపించిందని చెబుతున్నారు.
#Kuberaa is a watchable crime drama that has solid moments that work well in both halves, but, at the same time, is too lengthy with an uneven pace and a rushed pre-climax and climax sequence.⁰⁰First and foremost, Dhanush gives arguably his career-best performance. He is superb…
— Venky Reviews (@venkyreviews) June 20, 2025
మొత్తం మీద…
‘కుబేర’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న ఫీడ్‌బ్యాక్ చూస్తే ఇది శేఖర్ కమ్ములకు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ మూవీగా చెప్పొచ్చు. నాగార్జున, ధనుష్ నటనలకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కథనంగా కూడా మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్న సినిమా అన్న టాక్ రావడమే సినిమాకు ప్లస్.
అందరూ చెప్పేది ఒక్కటే: “ఇది ధనుష్‌ష్ షో… కానీ నాగ్ కూడా తగ్గేదే లే!”
#Kuberaa: Purest #ShekarKammula touch 👑
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) June 20, 2025
Heartfelt, Rooted, and Impactful.🏆🏆🏆#Dhanush stuns, #NagarjunaAkkineni earns respect, #Rashmika impresses and likely be a one of her most memorable performances.
Anyday #DSP BGM is 🔥🔥 in Emotional scenes.
#Kuberaa Good plot but failed in execution 😤 First half Dhanush & Nagarjuna 👌🏼Second half Dhanush & Rashmika performed well 👍🏼
— RK (@rk_dublin) June 20, 2025
Dsp bgm is good 🙌🏻 Biggest drawback runtime 👎🏼
My Rating: 3/5 ⭐️⭐️⭐️ pic.twitter.com/sh2jSNHtLX
Movies shot in real locations >>>>>>>>> sets n vfx…!!! Anytime#Kuberaa is another great example
— Thyview (@Thyview) June 19, 2025
It’s soo refreshing…!!!






























