Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు ఈమె తన జీవనోపాధి కోసం హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని ఎంతోమంది ఆకలిని తీర్చుతూ తన కడుపు నింపుకున్నారు. అయితే ఈమె తన మాట పేరుతో అక్కడికి వచ్చిన కస్టమర్లను పలకరించే విధానంతో ఎంతో పాపులర్ అయ్యారు. ఇలా కుమారి ఆంటీ సోషల్ మీడియా వేదికగా ఒక సెలబ్రిటీగా మారిపోయారు.

ఇలా ఈమె క్రేజ్ రోజు రోజుకి పెరగడమే కాకుండా ఏకంగా తనకు బుల్లితెర సీరియల్స్ లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. జీవనోపాధి కోసం ఫుడ్ స్టాల్ పెట్టుకున్నటువంటి ఈమె ఏకంగా సెలబ్రిటీగా మారిపోయారు. ఇక ప్రస్తుతం కుమారి ఆంటీ ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఆమెను చుట్టుముడుతూ ఉన్నారు అంతేకాకుండా ఈమె ఎక్కడికి వెళ్ళినా అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవి ఒకింత తన వ్యక్తిగత జీవితాన్ని కాస్త ఇబ్బందులకు గురిచేస్తాయని కూడా చెప్పాలి.
తాజాగా ఈమె గోల్డ్ షాప్ కి వెళ్లి ఖరీదైన నెక్లెస్ కొన్నారు. అయితే ప్రమోషన్ల కోసం వెళ్లారో, లేకపోతే కొనాలని వెళ్లారో తెలియదు కానీ అక్కడ కూడా ఈమె గోల్డ్ కొంటూ ఉండడంతో పెద్ద ఎత్తున ఆమెను చుట్టుముట్టి ఫోటోలు వీడియోలు తీయడం ప్రారంభించారు. ఇక ఈమె భారీగానే బంగారం కొనుగోలు చేశారని తెలుస్తుంది అయితే ప్రతినెల రూపాయి, రూపాయి కూడు పెట్టుకొని తాను కొన్నానని కుమారి ఆంటీ తెలిపారు.
ప్రతినెలా పోగుచేసి..
ఇలా కుమారి ఆంటీ గోల్డ్ చైన్ కొన్నటువంటి వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కుమారి ఆంటీ రేంజ్ పూర్తిగా మారిపోయింది అంటూ కొందరు కామెంట్లు చేయక మరికొందరు అక్క జాగ్రత్త ఇన్కమ్ టాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇలా పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె కెరియర్ పైన దెబ్బ కొట్టకండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.

































