Kushboo: సీనియర్ హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన కుష్బూ ఆ తర్వాత హీరోయిన్ గా మారి తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. ఈమె అందం,అభినయానికి మంత్రముగ్ధులైన అభిమానులు ఏకంగా గుడి కట్టించారు.

ఇక ప్రస్తుతం కుష్బూ ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో కొనసాగుతోంది. ఇక ఇటీవల గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమాలో కీలక పాత్రలో నటించింది. శ్రీవాస్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ పనులను ప్రారంభించింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో హీరోయిన్ దర్శకుడు తో పాటు కుష్బూ కూడా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా అని ప్రమోట్ చేస్తోంది.
ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ సినిమా విశేషాలతోపాటు మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ ఇంటర్వ్యూలో కుష్భు మాట్లాడుతూ..” చిరంజీవి ఓ లెజెండ్. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయనలో మానవత్వం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం, చేసే పని మీద ప్యాషన్ అద్భుతంగా ఉంటాయి.

Kushboo: పూర్తికాని నా కల…
ఇప్పటికీ ఆయన ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. ‘నేను మెగాస్టార్.. నేను ఏది చేసినా చూస్తారు’ అని అనే భావన లేకుండా ఇప్పటికీ కష్టపడుతూనే ఉంటారు.నా జీవితంలో పూర్తికాని, నా కల ఏదైనా ఉంది అంటే.. అది చిరంజీవి గారితో రొమాన్స్ చేయలేకపోవటమే.. ఆయనతో కలిసి పని చేయటానికి ఓ మంచి స్క్రిప్టు కోసం చూస్తున్నా.. మెచ్యూర్ లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలాంటివి చిరంజీవి గారితో చేయాలని ఉంది” అంటూ కుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.































