వివాహం జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇరుగు పొరుగు వారు అనే సూటిపోటి మాటలు భరించలేకు ఓ మహిళ చత్తీస్‌గఢ్‌లోని దంతరి అనే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. మూడుసార్లు అతడి దగ్గరకు వెళ్లింది.. కానీ రెండుసార్లు అతడు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాడో ఆమెకు అర్థం కాలేదు.

ఎందుకంటే అతడు ఇచ్చే మత్తు మందు కారణంగా ఇలా జరిగింది. అయితే మూడో సారి అతడు ఆమెకు ఇచ్చే మత్తు మందు ఇచ్చాడు. కానీ ఆమె మత్తులోకి జారుకోలేదు. ఆమెకు కాస్త స్పృహ ఉండటంతో.. అతడు తనపై లైంగిక దాడి చేసిన విషయం ఆమెకు తెలిసింది.
దీంతో షాక్ కు గురైన ఆమె అతడిని నిలదీయగా.. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా పోలీసులకు తెలిపింది బాధితురాలు. విషయం తెలుసుకున్న ఫేక్ డాక్టర్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఫోన్ నంబర్లు మార్చి మరో ప్రదేశానికి మకాం మార్చాడు. అయితే పోలీసులు అతడి ఉంటున్న ఏరియాను తెలుసుకున్నారు.
రెండ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ వేశారు. పేషెంట్ అని చెప్పి అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అతడి దగ్గరకు వెళ్లింది ఓ లేడీ కానిస్టెబుల్. అతడితో మాట్లాడుతూనే యూ ఆర్ అండర్ అరెస్ట్ అనేసింది. దీంతో ఆ డాక్టర్ షాక్ అయ్యాడు. ఏం జరిగిందో తెలిసే లోపు అతడు అరెస్టు అయ్యాడు. తర్వాత జైలు పాలై చిప్పకూడు తింటున్నాడు.



























