Lakshmi Parvathi : ఎన్టీఆర్ గారు కొడుకులకి ఎంత ఆస్తి ఇచ్చారంటే… బాలకృష్ణ కి ఎంత ఆస్తి ఇచ్చారంటే…: లక్ష్మి పార్వతి

0
386

Lakshmi Parvathi : సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్యగా అందరికీ తెలిసిన లక్ష్మి పార్వతి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మళ్ళీ మీడియా ముందు తరచూ ఎన్టీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి అవకాశం దొరికినపుడల్లా వెన్ను పోటు అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. మొన్నా మధ్య జగన్ నాకు జీవితాన్ని ఇచ్చాడు అంటూ ఎన్టీఆర్ వర్ధంతి నాడు మాట్లాడిన లక్ష్మి పార్వతి గారు మరోసారి లోకేష్ పాదయాత్ర గురించి కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఇక తరచూ నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడంటూ చెప్పే లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ గారు కొడుకులకు ఎలా ఆస్తి ఇచ్చారనే విషయాన్నీ తెలిపారు.

ఆస్తులన్నీ పిల్లలకు ఇచ్చి…

రామారావు గారు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నపుడే పిల్లలందరికీ ఆస్తులను సమంగా ఇచ్చి ఆయనతో ఏ ఆస్తి లేకుండా చేసుకున్నారు అంటూ లక్ష్మి పార్వతి వివరించారు. ఎన్టీఆర్ గారు కొడుకులందరికీ ఇల్లు కట్టించి ఇచ్చారని ఆస్తులను సమానంగా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.

నా మీద నిందలు వేయడానికి ఆస్తుల కోసం, పదవుల కోసం ఎన్టీఆర్ గారి పక్కన చేరినట్లు నా మీద నిందలు వేస్తారు. కానీ నేను వచ్చే సమయానికి ఆయన వద్ధ ఎలాంటి ఆస్తులు లేవు. ఇక పదవుల మీద నాకు వ్యామోహం ఉండి ఉంటే నేను ఎపుడో పదవులను తీసుకుని ఉండేదాన్ని. ఆయన ఎన్నో సార్లు అడిగారు కానీ నేను తిరస్కరించాను అంటూ వివరించారు లక్ష్మి పార్వతి.