Lakshmi Parvathi : సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య గా అందరికీ తెలిసిన లక్ష్మి పార్వతి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మళ్ళీ మీడియా ముందు తరచూ ఎన్టీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి అవకాశం దొరికినపుడల్లా వెన్ను పోటు అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. మొన్నా మధ్య జగన్ నాకు జీవితాన్ని ఇచ్చాడు అంటూ ఎన్టీఆర్ వర్ధంతి నాడు మాట్లాడిన లక్ష్మి పార్వతి గారు మరోసారి లోకేష్ పాదయాత్ర గురించి కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఏదో ఒక ఇంటర్వ్యూతో కనిపిస్తున్నారు.

జూనియర్ కు వాళ్ళ మోసం తెలుసు…
ప్రస్తుతం టీడీపీ పగ్గాలు నారాచంద్రబాబు నాయుడు చేతిలో ఉండగా నందమూరి కుటుంబం వారికి అండగా ఉంది. అయితే లక్ష్మి పార్వతి మాట్లాడుతూ నారా వారి చేతిలోకి పార్టీ పోయిందని, నందమూరి వాళ్ళను మోసం చేశాడంటూ చంద్రబాబు మీద విమర్శలు చేసారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కు నారా చంద్రబాబు నాయుడు ఎలా మోసగిస్తాడో తెలుసు కాబట్టే అతను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు అంటూ వాఖ్యాణించారు. చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని పావులాగ వాడుకుని అవసరం తీరాక వదిలేస్తాడు అంటూ అభిప్రాయపడ్డారు.