Lakshmi Pranathi: లక్ష్మీ ప్రణతి పరిచయం అవసరం లేని పేరు.యంగ్ హీరో ఎన్టీఆర్ సతీమణిగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి లక్ష్మీ ప్రణతి సినిమాలకు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటూ ఒక సాధారణ గృహినిల ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇలా ఒక భార్యగా అన్ని వ్యవహారాలను చక్కగా నిర్వర్తిస్తూ ఎన్టీఆర్ కెరియర్ కు ఎంతో ఆసరాగా నిలుస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వివాహం 2011 మే 5వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా తరలివచ్చారు.ఎన్టీఆర్ వివాహం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. అయితే తాజాగా ఎన్టీఆర్ వివాహం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల వివాహ వేడుకలలో భాగంగా లక్ష్మీ ప్రణతి కట్టిన చీర ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. లక్ష్మీ ప్రణతి వివాహ సమయంలో బంగారు వర్ణపు రంగు చీరను కట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ చీరకు మ్యాచింగ్ డైమండ్ జువెలరీని కూడా ధరించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈమె దరించిన చీర ఖరీదు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Lakshmi Pranathi: కోటి రూపాయల చీర కట్టిన ప్రణతి..
లక్ష్మీ ప్రణతి ధరించిన ఈ చీరను ప్రత్యేకంగా డిజైన్ చేశారని తెలుస్తుంది. ఈ చీరను తయారు చేయడం కోసం బంగారు వెండి పోగులతో తయారు చేశారని తెలుస్తోంది.ఇలా బంగారు వెండితో తయారుచేసిన ఈ చీర ఖరీదు అక్షరాల కోటి రూపాయలన్న విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎన్టీఆర్ భార్య పెళ్లిలో కట్టుకున్న ఈ చీర ఖరీదు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.