Lakshmi Vasudevan:ప్రస్తుత కాలంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు రోజురోజుకు శృతిమించి పోతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీల నుంచి మొదలుకొని చిన్నచిన్న ఆర్టిస్టుల వరకు వారి ఫోన్లను హ్యాక్ చేస్తూ వారికి ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించడం లేదా వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ బుల్లితెర నటి లక్ష్మీ వాసుదేవన్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎవరు కూడా తనలా తప్పు చేయొద్దని అందరిని అలర్ట్ చేసింది. ఎవరో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి తన వాట్సప్ గ్రూపులకు తనకు తెలిసిన వారికి ఫోటోలను షేర్ చేస్తూ తనని డబ్బులు కావాలంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ తప్పు జరగడానికి తానే కారణమని ఎవరు కూడా ఇలాంటి తప్పు చేయొద్దు అంటూ ఈమె అందరికీ సూచించారు.గత కొద్ది రోజుల క్రితం నా అకౌంట్లో 5 లక్షల క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దాంతో తను ఆ లింక్ ఓపెన్ చేయగానే తనకు తెలియకుండానే ఒక యాప్ డౌన్లోడ్ అయిందని తద్వారా తన ఫోన్ హ్యాక్ కావడంతో తన ఫోటోలను కొందరు సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేసి తన వాట్సాప్ గ్రూప్ కు పంపించారు

Lakshmi Vasudevan: ఫోటోలను మార్ఫింగ్ చేసి
అదేవిధంగా ఐదు వేల రూపాయల డబ్బులు పంపకుంటే ఈ ఫోటోలను మరింత మందికి ఫార్వర్డ్ చేస్తామని బెదిరిస్తున్నట్టు ఈమె వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈమె హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించి అసలు విషయం వెల్లడించారు. తన వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలిసిందే.అయితే పొరపాటున నేను చేసిన తప్పు వల్ల ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఇలాంటి తప్పు మరొకరు చేయొద్దు అంటూ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన ఫోన్ హ్యాక్ అయిన విషయాన్ని వెల్లడించారు.
































