Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కమెడియన్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో త్వరలో జరగబోయే ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా హైపర్ ఆది పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

గత మూడు రోజుల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి సమావేశంలో మాట్లాడుతూ అధికార నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పిఠాపురంలో ఎక్కడికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కు పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుందని కచ్చితంగా పిఠాపురంలో గెలుస్తారని జనసేన అందుకోబోయే మొదటి విజయం పిఠాపురమని తెలిపారు.
పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో తప్పకుండా గెలుస్తారని తెలిపారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎంతగానో కృషి చేస్తున్నటువంటి వర్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని వెల్లడించారు. వర్మ గారు ఈ నియోజకవర్గ ప్రజలతో ఎంతో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారనీ తెలిపారు.
పొలిటికల్ కమెడియన్స్..
ఇక ఈ సమావేశంలో భాగంగా మీడియా వారు కమెడియన్ల చేత ప్రచారాలు చేపిస్తే గెలుస్తారా అని కూడా అంటున్నారు. ఈ విషయంపై మీ స్పందన ఏంటనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ మేము ప్రొఫెషనల్ కమెడియన్స్ వాళ్ళ మాదిరిగా పొలిటికల్ కమెడియన్స్ కాదు అంటూ తనదైన శైలిలోనే సెటైర్స్ వేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























