Nara Lokesh: నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినటువంటి లోకేష్ పార్టీ కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తన తండ్రి హయామంలో ఎమ్మెల్సీ ద్వారా మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన లోకేష్ అనంతరం 2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగారు. అయితే ఎవరు ఊహించిన విధంగా మంగళగిరిలో లోకేష్ ఓటమిపాలు అయిన సంగతి తెలిసినదే.

ఇలా మంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడంతో ఈయన ఈ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అక్కడ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయనే విషయంపై దృష్టి సారించి ఈయన తరచూ ప్రజల మధ్యలోనే ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి దోహదం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన అనంతరం ఈయన కేవలం మంగళగిరికే ప్రాధాన్యత ఇస్తూ అక్కడ ప్రజల సమస్యలను తీర్చడంలో విజయవంతం అయ్యారు. ఈ విధంగా మంగళగిరిలో మంచి పట్టు సాధించిన లోకేష్ ఈసారి మాత్రం ఎన్నికలలో విజయం సాధించాలని ఎంతగానో కృషి చేశారు.
30 వేల మెజారిటీ..
ఎక్కడైతే తాను ఓడిపోయానో అక్కడే గెలిచి చూపించాలన్న కసితో మంగళగిరిలో పనిచేసినటువంటి లోకేష్ కి ఈసారి విజయం గ్యారెంటీ అని తెలుస్తుంది. లోకేష్ ఈసారి సుమారు 30 వేల ఓట్ల మెజారిటీతో విజయం అందుకోబోతున్నారు. ఇక లోకేష్ కు పోటీగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి స్థానిక మహిళ మురుగుడు లావణ్యను జగన్మోహన్ రెడ్డి ఎన్నికల బరిలో దింపారు.





























