Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి రాజకీయాల పరంగా మంచి విజయం సాధిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే పలు సర్వేలు కూడా పవన్ గెలుపు ఖాయమని తెలియజేస్తున్నాయి. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తన ప్రత్యర్థి వంగా గీత పై భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ విజయం అందుకుంటున్నారని పలు సర్వేలు తెలియజేయడంతో పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారని అలాగే కూటమి కూడా అధికారంలోకి రాబోతుందని తెలుస్తుంది.
ఇలా కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ తప్పకుండా డిప్యూటీ సీఎం లేదంటే హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా పవన్ గురించి మరొక వార్త వైరల్ గా మారింది. కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఆయన ఏ విధమైనటువంటి మంత్రి పదవులు అందుకోరని తెలుస్తోంది.
సినిమాలపైనే ఫోకస్..
ఒక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఇక మంత్రిగా బాధ్యతలు అందుకున్న తర్వాత ఈయన సినిమాల వైపు చూడటానికి కూడా అవకాశం ఉండదు అందుకని తాను ఎమ్మెల్యేగా కొనసాగుతూనే తన సినిమాలపై ఫోకస్ పెట్టడం కోసం పవన్ కళ్యాణ్ ఎలాంటి మంత్రి పదవులు కూడా ఆశించడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చి సినిమాలు నిలిపివేశారు. దీంతో ఆ సినిమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత పవన్ పై ఉంది కనుక తాను ఎలాంటి పదవులను ఆశించడం లేదని తెలుస్తుంది.





























