Pawan Kalyan: మే 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. మరొక వారం రోజులలో ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆత్రుత ఆసక్తి నెలకొంది. ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీ సింగిల్ గా పోటీ చేయగా మరోవైపు బిజెపి జనసేన టిడిపి కూటమిగా ఏర్పడ్డాయి.

ఈ కూటమిలో భాగంగా జనసేన కేవలం 21 సీట్లకు మాత్రమే ఎంపిక ఆయన సంగతి తెలిసిందే. నిజానికి 55 సీట్ల వరకు జనసేన పోటీ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల తమ సీట్లను వదులుకోవాల్సి వచ్చింది. ఇలా 21 స్థానాలలో జనసేన పోటీ చేస్తున్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో విజయం సాధించడం పక్కా అని ఇప్పటికే జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమి కూడా అధికారంలోకి రాబోతుందని పలు సర్వేలు తెలియచేసాయి. ఇలాంటి తరుణంలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కి ఎలాంటి పదవులు వస్తాయనే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి.
డిప్యూటీ సీఎం…
కూటమి అధికారంలోకి వస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని అలాగే హోంశాఖ మంత్రిగా బాధ్యతలు కూడా అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఒక పార్టీ అధినేతగా టిడిపి కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ రెండు పదవులు ఇస్తేనే చాలా గౌరవంగా ఉంటుందని లేకపోతే ఆయనకు మరోసారి అన్యాయం జరిగినట్టేనని అభిమానులు భావిస్తున్నారు. మరి అభిమానులు కోరుకున్న విధంగా కూటమి అధికారంలోకి వస్తుందా పవన్ కళ్యాణ్ కు ఈ రెండు పదవులు అప్పగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.





























