Kethi Reddy: 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయము అందుకున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్నికలలో ఘోర పరాజయం అందుకుంది. ఇక వైసిపి ఎమ్మెల్యేలలో ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి నిత్యం ప్రజలలోనే ఉండేవారు. ప్రతిరోజు ఉదయం గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరంలోని ప్రతి గడపకు వెళుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడే అధికారులు అందరికీ ఫోన్లు చేసే ఆ సమస్యను అక్కడే తీర్చేవారు అలాగే ఎవరికైనా సహాయం కావాలి అంటే ఆయన సొంత డబ్బుతోనే సహాయం చేశారు. ఇలా గత ఐదు సంవత్సరాలుగా ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల వద్దకు వెళ్లినటువంటి ఈ గొంతు మూగబోయింది.
2024 ఎన్నికల ఫలితాలలో బిజెపి పార్టీ తరపున పోటీ చేసినటువంటి సత్య కుమార్ యాదవ్ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారు అయితే ఆయన ఎవరు ఏంటి అనేది ఎప్పుడు కూడా ధర్మవరం ప్రజలు చూడలేదు. కానీ ఆయన మాత్రం కేతిరెడ్డి పై సుమారు 3000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా వెంకటరామిరెడ్డి ఓడిపోవడంతో ఆయన ఎమోషనల్ అయ్యారు.
ఓటమికి కారణం ఏంటి..
గత ఐదు సంవత్సరాలుగా నిత్యం ప్రజలలోనే ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న నేను ఇలా ఓడిపోవడానికి కారణం ఏంటో అంతు చిక్కడం లేదని ఎమోషనల్ అయ్యారు. ఐదేళ్లుగా నేను పడిన కష్టానికి ఫలితం లేదు కానీ రెండు నెలల ముందు వచ్చి ధర్మవరంలో పర్యటించిన ఆయన గెలవడం ఏంటి అంటూ ఈయన ఎన్నికల ఫలితాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























