ఆ రెండు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న.. ఆర్ఆర్ఆర్ ?

0
60

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో రాజమౌళి “ఆర్ఆర్ఆర్” ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా మొదటి దశ, రెండవ దశ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం ప్రకటించారు.త్వరలోనే ఈ రెండు పాటలు చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తుండగా అలియాభట్, ఒలివియా మోరీస్‌  హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటిస్తున్నటువంటి ఎన్టీఆర్ తండ్రి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించనున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పలు పోస్టర్లు, టీజర్లు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుని ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here