Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు అయితే ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోల అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని తరచూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గొడవ పడుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయాలు గురించి ఎప్పటికప్పుడు పలు సర్వేలు తెలియజేస్తూ ఉంటాయి.

తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం గురించి ప్రముఖ మీడియా సంస్థ ఏప్రిల్ 24 వరకు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడించింది. తెలుగు మోస్ట్ పాప్యులర్ మేల్ స్టార్స్ పేరిట జరిగిన సర్వే లో కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఈ సర్వేలలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా రెండో స్థానంలో మహేష్ బాబు నిలిచారు.
ఇక మూడో స్థానంలో ఎన్టీఆర్ నాలుగో స్థానంలో అల్లు అర్జున్ 5వ స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. ఇక ఆరవ స్థానం నుంచి వరుసగా 10 వరకు ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్, నాని, రవితేజ చిరంజీవి విజయ్ దేవరకొండ వరుసగా 6 నుంచి పది స్థానాలలో చోటు దక్కించుకున్నారు.
మొదటి స్థానంలో ప్రభాస్..
ఇలా ఇండస్ట్రీలో నెంబర్ వన్ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీగా మెగా ఫ్యామిలీకి గుర్తింపు పొంది కానీ ఈ సర్వేలో మాత్రం మెగా హీరోలు నాలుగు ఐదు స్థానాలలో ఉండటంతో ఇది నిజంగానే వారికి షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ సర్వేలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉండడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



























