Lavanya Tripati: మెగా కోడలు ఉపాసన వివిధ వ్యాపారాలను చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఇటీవల ఈమె తన అత్తయ్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా తనకు బహుమతిగా అత్తమ్మ కిచెన్స్ అంటూ సరికొత్త బిజినెస్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. సురేఖ సమక్షంలో అక్కడ వంటలన్నీ తయారై చాలా హైజనిక్ గా ఫుడ్ ప్యాక్ అవుతూ అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు.

తాజాగా మరో మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన అత్తయ్యతో కలిసి ఆవకాయ పెడుతూ ఉన్నటువంటి ఫోటోలను అత్తమ్మ కిచెన్స్ ద్వారా షేర్ చేశారు. ఇలా వరుణ్ తల్లితో లావణ్య త్రిపాఠి కలిసి ఆవకాయ పెడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలను అత్తమ్మ కిచెన్స్ ద్వారా షేర్ చేయడంతో ఎంతోమంది అత్తమ్మ కిచెన్స్ పై విమర్శలు చేశారు.
వారు తయారు చేస్తున్నటువంటి ఆ పికిల్ విషయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. జుట్టు మొత్తం విరపోసుకున్నారు కనీసం హెడ్ క్యాప్ ధరించలేదు. అలాగే చేతికి గ్లౌజ్ కూడా లేదు ఏమాత్రం హైజనిక్ మెయింటెన్ చేయలేదు అంటూ విమర్శలు కురిపించారు. అయితే ఈ విమర్శలపై అత్తమ్మకి స్పందించారు వారు.
హైజిన్‌గా లేదు..
అమ్మడం కోసం ఆవకాయ పెట్టడం లేదని తమ ఇంటి కోసం పెట్టుకుంటున్నారు అందుకే ఇలా జాగ్రత్తలు తీసుకోలేకపోయారు అంటూ వివరణ ఇచ్చారు. అత్తమ్మాస్ కిచెన్ కోసం చేసేటప్పుడు ఎంతో హైజిన్‌గా మెయింటైన్ చేస్తారని క్లారిటీగా చెప్పారు. ఇలాంటి పోస్టులు పెట్టి స్టాక్ లిమిటెడ్ అంటే అత్తమ్మ కిచెన్స్ కోసమే తయారు చేస్తున్నారని అనుకుంటారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేశారు.



























