Lavanya Tripathi: మెగా హీరో వరుణ్ తేజ్,లావణ్య త్రిపాటి ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గత రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అందుకు గల కారణం వరుణ్ తేజ్ జనవరి 19వ తేదీ పుట్టిన రోజు జరుపుకోవడంతో ఆయన 25 లక్షల విలువచేసే డైమండ్ రింగ్ తో బెంగుళూరుకి వెళ్లారని, డైమండ్ రింగ్ తో లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే తన గురించి వస్తున్న ఇలాంటి వార్తలకు లావణ్యత్రిపాఠి కేవలం ఒకే ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా లావణ్య త్రిపాఠి తన కుటుంబంతో కలిసి డెహ్రడూన్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే వారి ఊరికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

ఈ సందర్భంగా లావణ్య త్రిపాటి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ ప్రస్తుతం డెహ్రడూన్ లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా… మా ఊరి అందాలను ఆస్వాదిస్తున్న అంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
ఈ విధంగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ తన గురించి వస్తున్న గాసిప్ లకు క్లారిటీ ఇచ్చారు.అయితే వీరి గురించి ఇలాంటి వార్తలు రావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలో నటించారు.ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. అదేవిధంగా వరుణ్ తేజ్ సోదరి నిహారిక వివాహంలో హీరోయిన్ ఎవరు లేకపోయినా లావణ్యత్రిపాఠి మాత్రమే కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఇలా వీరి గురించి వస్తున్న ఈ వార్తలకు లావణ్యత్రిపాఠి క్లారిటీ ఇచ్చారు.































