Lavanya Tripati: మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఇంటికి పరిమితం అయ్యారు. ఈమె కాలు ఫ్రాక్చర్ కావడంతో డాక్టర్లు తప్పనిసరిగా ఈమెను రెస్ట్ తీసుకోవాలని సూచించడంతో బెడ్ రెస్ట్ లో ఉన్నారు. లావణ్య త్రిపాటి కాలికి ఫ్యాక్చర్ కావడం ఏంటి అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే..

గత నెల రోజుల క్రితం ఈమె మెట్లు దిగుతూ ఉన్న సమయంలో జారారట. అయితే ఆ సమయంలో తన ఖాళీకి నొప్పి కలిగినప్పటికీ దీనిని చాలా లైట్ తీసుకున్నారని తెలుస్తుంది. అయితే నెల తరబడి నొప్పి వస్తున్నప్పటికీ ఈమెకు అనుమానం వచ్చి ఒకసారి స్కానింగ్ చేయించారట స్కానింగ్ చేయించగా లోపల యాంకిల్ ఫాక్చర్ అయిందని రిపోర్ట్ వచ్చిందట.
ఇలా తన కాలికి యాంకిల్ ఫ్రాక్చర్ కావడంతో ఇక ఈమె నడవడానికి వీలు లేదని కొద్ది రోజులు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే కాలికి బెల్ట్ వేసుకొని ఈమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ విజయం తర్వాత మెగా ఇంటికి వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
యాంకిల్ ఫ్రాక్చర్..
ఆ సమయంలో వరుణ్ లావణ్య ఇద్దరు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కానీ ప్రమాణ స్వీకారానికి మాత్రం వీరిద్దరూ హాజరు కాలేదు. అప్పటికి ఈమె కాలికి సంబంధించిన ఈ విషయం తెలియడంతో విశ్రాంతి తీసుకుంటూ ఇంటిలోనే ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా లావణ్య త్రిపాఠి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు ఈమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.



























