Lavanya Tripaathi: వరుణ్ తో పెళ్లి కోసం ఆ కండిషన్ కి ఒప్పుకున్న లావణ్య త్రిపాఠి… ఏంటా కండిషన్?

0
569

Lavanya Tripaathi: మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. మెగా ప్రిన్స్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్త వైరల్ అవుతుంది. ఇక వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9వ తేదీ జరగబోతుందని తెలుస్తుంది.

ఇప్పటికే మెగా ఫ్యామిలీలో నిశ్చితార్థపు వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలకు నిశ్చితార్థపు ఆహ్వానం కూడా అందిందని సమాచారం. ఇలా వీరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా లావణ్య త్రిపాటి, వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరుణ్ తేజ్ ను లావణ్య త్రిపాఠి వివాహం చేసుకోవాలి అంటే మెగా ఫ్యామిలీ తనకు ఒక కండిషన్ పెట్టారని తెలుస్తుంది.ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే వీరి వివాహం జరుగుతుందని మెగా ఫ్యామిలీ కండిషన్ పెట్టారట అయితే లావణ్య త్రిపాఠి తనకు వరుణ్ తేజ్ కన్నా మరేది ఇంపార్టెంట్ కాదని మెగా ఫ్యామిలీ చెప్పిన కండిషన్ కి ఒప్పుకొని తనతో పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

Lavanya Tripaathi: వెండితెరకు దూరమవుతున్న లావణ్య…


మరి లావణ్య త్రిపాటికి మెగా ఫ్యామిలీ ఎలాంటి కండిషన్ పెట్టారు ఏంటి అనే విషయానికి వస్తే…లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే ఈమె సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలలో నటించకూడదన్న కండిషన్ మెగా ఫ్యామిలీ పెట్టారట అయితే తనకు వరుణ్ తో జీవితమే ముఖ్యమని భావించిన లావణ్య త్రిపాఠి ఈ కండిషన్ కి ఒప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో పెళ్లి తర్వాత ఇకపై ఈమె తెరపై కనిపించదని తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.