Lavanya Tripati: నటి లావణ్య త్రిపాఠి మరి కొద్ది రోజులలో మెగా ఇంటికి కోడలు కాబోతున్న విషయం మనకు తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి లావణ్య త్రిపాఠి జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలియడంతో వీరి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దాదాపు ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు కూడా గత ఏడాది వివాహం చేసుకోవాలని భావించారట కానీ నిహారిక కోసమే దాదాపు ఏడాది పాటు వీరి వివాహాన్ని వాయిదా వేసుకున్నారని తెలుస్తుంది.
నిహారిక వివాహం జొన్నలగడ్డ వెంకట చైతన్యతో జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహం జరిగిన వెంటనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి చేసుకోవాలని భావించారట. అయితే అప్పటికే నిహారిక చైతన్య మధ్య మనస్పర్ధలు రావడం ఇద్దరు వేరువేరుగా ఉండడంతో లావణ్య త్రిపాఠి నిహారిక విషయంలో జోక్యం చేసుకున్నారట.ఎలాగైనా నిహారిక కాపురం చక్కదిద్దాలని ఈమె భావించినట్లు తెలుస్తోంది.

Lavanya Tripati: గత ఏడాదే వివాహం చేసుకోవాలనుకున్నారు…
ఈ క్రమంలోనే నిహారికను చైతన్యను కలిపే ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందట. ఇలా నిహారిక కాపురం చక్క దిద్ది వారిద్దరు సంతోషంగా ఉన్నప్పుడే లావణ్య వరుణ్ కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు కానీ నిహారిక చైతన్య మధ్య మాత్రం మనస్పర్ధలు తొలగిపోకపోవడంతో ఇక చేసేదేమి లేక నిహారిక ఇష్ట ప్రకారమే తనని వదిలేసి ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి నిహారిక కోసం ఈమె ఏడాది పాటు పెళ్లిని వాయిదా వేసుకున్నారని చెప్పాలి.































