Lavanya: లావణ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మీడియా వార్తలలో నిలుస్తున్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనని మోసం చేశారని 11 సంవత్సరాల పాటు తనతో కలిసి ఉండి ఇప్పుడు తనని వదిలించుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈమె నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు.

రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకొని ఆ పెళ్లి విషయాని రహస్యంగా ఉంచారు పలుసార్లు అబార్షన్ కూడా చేయించారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయనకు వేరే వారితో ఎఫైర్ ఉండటంవల్లే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా అంటూ ఎన్నో విమర్శలు చేశారు అయితే తాజాగా నాకు న్యాయం జరగాలని న్యాయం కోసం తాను పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్తానని ఈమె తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఇతర శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని అందుకే తనకు న్యాయం జరగాలని తన వద్దకే వెళ్లి న్యాయం కోరుతానని తెలిపారు.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు..
ఇకపోతే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం మూడో వివాహం కూడా చేసుకున్నారు.అయితే ఈయన తన మాజీ ఇద్దరు భార్యలతో ఉన్నప్పుడు వారిని చాలా ప్రేమగా చూసుకున్నారు కానీ రాజ్ తరుణ్ అలా కాదని నాకు తినడానికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.


























