Ram Charan RC 15 Pic: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఇప్పటివరకూ దాదాపు రూ.900కోట్లు వసూలు చేయడం మూములు విషయం కాదు. బాహుబలి తర్వాతి రాజమౌళి డైరెక్షన్‌పై అంచనాలు మామూలుగా పెరగలేదు. అందుకు తగ్గట్టుగానే , ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా విజువల్ వండర్‌ను క్రియేట్ చేశారని ఇప్పటికే చాలా మంది ప్రముఖులు సైతం ఆయన్ని పొగడ్తల్లో ముంచెత్తారు.

ఇకపోతే నూతన సంవత్సరం చరణ్‌కి బాగా కలిసొచ్చినట్టు తెలుస్తోంది. కనీసం ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సక్సెస్‌కు సంబంధించిన కొన్ని పార్టీలలోనూ పాల్గొనకుండా తన నెక్స్ట్ ప్రాజెక్టులపై చెర్రీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలకు ఓకే చెప్పిన చరణ్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ ప్రస్తుతం నెట్టింట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

రామ్ చరణ్ అచ్చం పల్లెటూరి వ్యక్తిలా పంచె కట్టుకొని సైకిల్ వెళ్లే ఓ పిక్ ఇప్పుడు సోషల‌్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఫొటో RC15 అనే సినిమా సెట్ నుంచి లీక్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీని శంకర్ డైరెక్ట్ చేస్తుండగా, దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.అంతే గాకుండా ఈ మూవీలో రామ్ చరణ్ నాలుగు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.
సంక్రాంతి బరిలో RC 15…
అందులో భాగంగానే పొలిటికల్ క్యారెక్టర్‌గా చేసే చరణ్ సన్నివేశాన్ని ఇటీవలే పూర్తి చేసినట్టు సమాచారం. ఇక ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మళ్లీ భారీ బడ్జెట్‌లో రామ్ చరణ్ సినిమా వస్తుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మొత్తానికి రామ్ చరణ్ RC 15 ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























