చాలామంది షేర్లలో పెట్టుబడులు పెడుతుంటారు. అందులో రిస్క్ అనేది భారీగా ఉంటుంది. అదే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీల్లో అయితే కచ్చితమైన మంచి రిటర్న్ రావడమే కాదు… టాక్స్ బెనెఫిట్స్ కూడా ఉంటాయి. LIC గత కొద్ది రోజుల నుంచి అనేక రకాల పాలసీలతో ముందుకు వస్తోంది.

అందులో భాగంగానే జీవన్ ప్రగతి స్కీమ్ అనే కొత్త పథకం అందుబాటులో ఉంది. జీవన్ ప్రగతి పథకంలో ఒక వ్యక్తి రోజుకు రూ . 200 మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత 20 సంవత్సరాల తరువాత వారికి రూ. 28 లక్షలు తిరిగి వస్తాయి. మొత్తం పెట్టిన పెట్టుబడి సుమారు రూ.15 లక్షల దాకా అవుతుంది. దానికి రిటర్న్ రూ.28 లక్షలు వస్తుంది. అంతేకాదు రూ.15,000 పెన్షన్ కూడా ఇస్తారు. అంటే మొత్తం వచ్చేది రూ.29 లక్షలకు పైనే.
ఈ పాలసీలో 5 సంవత్సరాల తర్వాత పాలసీలో రిస్క్ కవర్ పెరుగుతుంది. తర్వాత సంవత్సరం నుచి అంటే ఆరేళ్ల నుంచి పది ఏళ్లకు ఇన్సూరెన్స్ రిస్క్ కవర్ 25 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుంది. పదకొండేళ్ల నుంచి పదిహేనేళ్ల వరకు రిస్క్ కవర్ 150 శాతానికి పెరుగుతుంది. ఇలా 20 ఏళ్ల వరకు చెల్లిస్తూ మధ్యలో మనీ తీసుకోకపోతే రిస్క్ కవర్ అనేది 200 శాతానికి పెరుగుతుంది.
12 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్లు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ పాలసీ కనీస గడును 12 ఏళ్లు మరియు గరిష్టంగా 20 ఏళ్ల వరకు ఉంటుంది. మెచ్యూరిటీ నాటికి గరిష్ట వయసు పరిమితి 65 ఏళ్లు ఉంటు సరిపోతుంది. కనీసం దీని ద్వారా లబ్ధి పొందేది 1.5 లక్షలు. పాలసీ దారు మధ్యలో చనిపోతే నామినీకి మెచ్యూరిటీ నాటికి కనీసం అమౌంట్ చెల్లిస్తారు.































