దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ కొన్ని పాలసీల ద్వారా కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఎన్నో ప్రైవేట్ సంస్థలు పాలసీలు అందిస్తున్నప్పటికీ పాలసీ తీసుకోవాలనుకునే వాళ్లు ఎక్కువగా ఎల్‌ఐసీ పాలసీలపైనే ఆసక్తి చూపుతారు. ఎల్‌ఐసీ పిల్లల కోసం అద్భుతమైన పాలసీలను అందిస్తోంది. ఆ పాలసీల ద్వారా పిల్లల భవిష్యత్ కోసం డబ్బు అవసరమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

ఎల్‌ఐసీ అందించే ప్లాన్లలో చిల్డ్రన్స్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీల గురించి అవగాహన ఏర్పరచుకుని పాలసీ తీసుకుంటే పిల్లలు పెద్దవాళ్లయ్యే సమయానికి వారికి ఆర్థికపరమైన భద్రతను ఈ పాలసీ ద్వారా సులభంగా కల్పించడం సాధ్యమవుతుంది. ఎల్‌ఐసీ సంస్థ అందిస్తున్న పాలసీలలో జీవన్ తరుణ్ పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీ టర్మ్ 25 సంవత్సరాలు కాగా 20 సంవత్సరాలకే ఏడాదికి కొంత మొత్తం చొప్పున తీసుకునే అవకాశం ఉంటుంది.

పుట్టిన పిల్లల నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లల పేర్లపై ఈ పాలసీని తీసుకోవచ్చు. జీవన్ తరుణ్ పాలసీ తీసుకున్న వాళ్లు మెచ్యూరిటీ బెనిఫిట్ తో పాటు సర్వైవల్ బెనిఫిట్ ను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీని తీసుకోవాలని ఆసక్తి చూపుతారో వారికి నాలుగు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మొదటి ఆప్షన్ ను ఎంచుకుంటే 25 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ బెనిఫిట్ ప్రయోజనాలను పొందవచ్చు.

రెండో ఆప్షన్ ను ఎంచుకుంటే 20 సంవత్సరాలు పూర్తైన తరువాత ఏడాదికి 5 శాతం చొప్పున పొందే అవకాశం ఉండటంతో పాటు మెచ్యూరిటీ సమయంలో 75 శాతం పాలసీ డబ్బులను తీసుకునే అవకాశం ఉంటుంది. మూడవది 20 సంవత్సరాల తరువాత ప్రతి సంవత్సరం 10 శాతం పొందితే మెచ్యూరిటీ సమయంలో 50 శాతం పాలసీ డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. నాలుగో ఆప్షన్ లో 20 సంవత్సరాల తరువాత ఏడాదికి 15 శాతం పొందుతూ మెచ్యూరిటీ సమయంలో 25 శాతం విత్ డ్రా చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here