ఒక్క పాలసీతో కుటుంబం మొత్తానికి బెనిఫిట్.. ఎల్ఐసీ విడుదల చేసిన ఈ పాలసీ వివరాలు మీ కోసం..

0
249

ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ వివిధ స్కీమ్ లను ప్రవేశపెడుతూ వినియోగదారులకు ప్రయోజనాలను కల్పిస్తోంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు పొందే విధంగా వివిధ రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులో భాగంగానే తాజాగా మరో పాలసీని వినియోగదారులకు తీసుకొచ్చింది. అదే ఆరోగ్య రక్షక్ పాలసీ.

దీనిని కొన్ని రోజుల క్రితమే ప్రవేశపెట్టినా.. కరోనా కారణంగా చాలామంది దీనిపై అంతగా ఆసక్తి చూపించలేదు. ఇది పూర్తిగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, రెగ్యులర్ ప్రీమియం, ఇండివీజ్యూవల్‌ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. దీనిని తీసుకున్న పాలసీదారుడు అతడి భాగస్వామి.. 20 ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలకు, మరియు అతడి 65 ఏళ్ల లోపు ఉన్న తల్లిదండ్రులకు ఈ ఆరోగ్య బీమా వర్తిస్తుంది. వివిధ రకాల వ్యాధులకు ఇది కవరేజ్ లభిస్తుంది.

దీనిని తీసుకునే వ్యక్తి 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 65 ఏళ్లుగా ఉండాలని పేర్కొన్నారు. పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు, పాలసీదారుడికి 80 ఏళ్లు వచ్చే వరకు పాలసీ వర్తిస్తుంది. రూ.2,500 నుంచి రూ.10,000 వరకు డైలీ బెనిఫిట్ ఎంచుకునే అవకాశం ఉంది. ప్రీమియం చెల్లించడానికి వివిధ రకాలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

దీనిలో హాస్పటలైజేషన్, సర్జరీ లాంటివి కూడా కవర్ అవుతాయి. 20 ఏళ్ల వయస్సున్న వ్యక్తి పాలసీ తీసుకుంటే.. డైలీ బెనిఫిట్ రూ.5000 ఉండే విధంగా తీసుకుంటే.. నెలకు రూ.7884 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వయస్సును బట్టి ప్రీమియం మారుతుంటుంది. ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత పదిహేను రోజుల వరకు ఫ్రీ లుక్ పీరియడ్ వుంటుంది. ఒకవేళ ఈ పాలసీ నచ్చకపోతే వెనక్కి తీసుకోవచ్చు.