Liger Movie: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఇలా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన గత ఏడాది లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా గత ఏడాది ఆగస్టు 25వ తేదీ విడుదలైంది అయితే ఈ సినిమా విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలను పెంచుతూ ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు కానీ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో పడగానే ఈ సినిమా జాతకం ప్రేక్షకులకు అర్థమయిపోయింది. ఈ సినిమా డిజాస్టర్ అంటూ రిజల్ట్ ఇచ్చేసారు.
ఈ విధంగా ఎంతో కష్టపడి ఎంతో ఎఫర్ట్ పెట్టి పాన్ ఇండియా స్థాయిలో విజయ్ దేవరకొండ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ప్రేక్షకులు డిజాస్టర్ అనగానే ఆయన రియాక్షన్ గురించి తాజాగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ బేబీ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

Liger Movie: సినిమాలంటే అన్నయ్యకు పిచ్చి…
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ లైగర్ సినిమా ఫ్లాప్ అని టాక్ వచ్చిన తర్వాత దాని గురించి అన్నయ్య విజయ్ దేవరకొండ ఏ మాత్రం ఆలోచించలేదని,ఆరోజు సాయంత్రానికల్లా ఆయన తన తదుపరి సినిమా ఖుషి సినిమా కోసం తన ప్రయత్నాలు మొదలుపెట్టి ఆ సినిమా పనులలో బిజీ అయ్యారని ఆనంద్ దేవరకొండ తెలిపారు. అన్న సినిమాలు ఫ్లాప్ అయినా కూడా.. ఇప్పటివరకు అన్నపెట్టిన ఎఫర్ట్స్ మీద ఎవరు వేలు ఎత్తి చూపలేరు. అంతగా అన్నయ్యకి సినిమాలంటే ఇష్టం అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






























