Liger Movie: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండబాలీవుడ్ నటి అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా గత ఏడాది ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల సమయంలో విజయ్ దేవరకొండ కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.ఇకపోతే తాజాగా ఈయన ఖుషి సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా లైగర్ డిజాస్టర్ గురించి మొదటిసారి స్పందించారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడుతూ…ఒక సినిమా సరిగా ఆడకపోతే నాకు బాధ కలుగుతుంది అలాగని మరొక సినిమా చేయకుండా నన్ను ఆపలేదని తెలిపారు. ఇప్పటివరకు నేను నటించిన సినిమాలలో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. హిట్ సినిమాలు ఉన్నాయి. ఇకపై చేసే సినిమాలలో కూడా హిట్ సినిమాలు ఉంటాయి. అలాగే ఫ్లాప్ సినిమాలు కూడా ఉంటాయని తెలిపారు. కానీ మా లక్ష్యం మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమేనని తెలియజేశారు..

Liger Movie: పడిన లేచి పరిగెత్తాలి…
నాకు ఫెయిల్యూర్స్ అంటే భయం నిజానికి అవి మనల్ని చాలా హర్ట్ చేస్తాయి కానీ మరొక సినిమాని చేయకుండా మాత్రం ఆపలేవు. నేను కింద పెడతానని భయం లేదు.. పడితే బాధపడతా కానీ నేను పరిగెత్తకుండా ఆపలేరు పడి లేచి పరిగెడతాను జీవితంలో కూడా అంతేను అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండకు జోడిగా సమంత నటించిన సంగతి తెలిసిందే.