ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందడంతో మారుమూలలో జరిగే వీడియోలు క్షణాలలో వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇలాంటి వీడియోలలో కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.ప్రస్తుతం ఇలాంటి ఒక ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అడవికి రాజుగా సింహాన్ని భావిస్తారు. సింహం వేట మొదలెట్టింది అంటే ఎంతో భయంకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.లయన్ కింగ్ అనే యూట్యూబ్ ఛానల్ షేర్ చేసిన ఈ వీడియోలో ఓ ఎత్తయిన ప్రదేశంలో చిరుత ఎంతో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆకలితో వేట మొదలెట్టిన సింహం అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న చిరుతను చూసి ఒక్క సారిగా దానిపై దాడి చేసింది.
సింహం దాడిని పసిగట్టిన చిరుత వెంటనే అప్రమత్తమై సింహం నుంచి తప్పించుకొని పరుగులు తీసింది. ఈ విధంగా రెండింటి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అటువైపుగా ఒక ఏనుగుల గుంపు వచ్చింది. అందులో పెద్ద ఏనుగులతో పాటు చిన్న ఏనుగులు కూడా ఉన్నాయి. అందులో ఒక ఏనుగు సింహం భారీ నుంచి చిరుతను కాపాడింది.
సింహం భారీ నుంచి చిరుతను రక్షించాలని భావించిన ఏనుగు సింహం వైపు కదులుతోంది. సింహం ఏనుగు రావడం గమనించి అక్కడినుంచి పారిపోవడంతో చిరుత ప్రాణాలతో బయట పడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది జంతు ప్రేమికులను ఆకట్టుకుంది.






























