ప్రస్తుత విపత్కర కరోనా పరిస్థితుల్లో లాక్ డౌన్స్ కారణంగా స్కూళ్ళు, కాలేజీలు మూసివేసి చాలా కాలం అయింది. ఈ నేపధ్యంలో తమ పిల్లలకు సబ్జెక్ట్ నాలెడ్జ్ మరియు స్కిల్స్ కోల్పోకూడదని భావిస్తున్నారు తల్లిదండ్రులు. అటువంటి వారు ఎక్కువగా ఆన్‌లైన్ ట్యూటర్లను ఆశ్రయిస్తున్నాయి. ఇంట్లోనే ఉంటూ పిల్లలకు ఆన్‌లైన్‌లో చదువు చెప్పించే పనిలో పడ్డారు తల్లిదండ్రులు.

ఈ నేపద్యంలో మీకు ఏదైనా సబ్జెక్టులో మంచి నాలెడ్జ్ ఉంటె.. మీరు కూడా ఆన్‌లైన్ ట్యూటర్ గా మారి విద్యార్దులకు క్లాసులు చెబుతూ డబ్బు సంపాదించవచ్చు. ఇప్పుడు ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. ఇనేంటి ఆలస్యం మీరు కూడా మీ టాలెంట్ బయటకు తీయండి. పిల్లలకు క్లాసులు నేర్పిస్తూ డబ్బు సంపాదించండి.






























