Loksatha Jayaprakash Narayan :నోట్ల రద్దు అనగానే భారతీయులకు 2016 నవంబర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలు గుర్తొస్తాయి. ఉన్నపళంగా మన దగ్గర ఉన్న 1000, 500 రూపాయల నోట్లు చెల్లవు అని చెప్పే సరికి అందరూ కంగారు పడ్డారు. ఆర్థిక రంగంలోని నల్లదనాన్ని కట్టడి చేయడానికి ఆ నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పిన కేంద్ర ప్రభుత్వం తాను సాధించిన ఫలితలెంటో తెలియలేదు. సామాన్య మధ్యతరగతి వాడికి మాత్రం ఎంతో ఇబ్బందులను తెచ్చిపెట్టిన నోట్ల రద్దును కూడా భరించాడు సగటు భారతీయుడు. దీనివల్ల అవినీతి పోతుందని ఆశపడ్డాడు. అయితే అసలు అవినీతి కానీ నల్లధనము కానీ వ్యవస్థ నుండి మాత్రం పోలేదు. మరోసారి నోట్ల రద్దు అంటూ కేంద్ర రిజర్వు బ్యాంకు ప్రకటనతో మరోసారి ఉలిక్కి పడ్డారు అందరు . ఇక ఈ ఇష్యూ గురించి అసలు నోట్ల రద్దు ద్వారా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను చేరుకుందా వంటి విషయాలను లోకసత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ గారు మాట్లాడారు.

నిజాయితీ లేని ప్రయత్నం విఫలమే…..
చేయాలనుకునుటున్న కార్యం మంచిదే అయినా అది నిజాయితీగా చేస్తేనే ఫలితం కూడా బాగుంటుంది. 2016 లో నోట్ల రద్దు చేయబోతున్నట్లు ప్రధాని ప్రకటించిన వెంటనే నేను ట్విట్టర్ ద్వారా అభినందించాను. కానీ ఆ నాడు అది మంచి చర్య అనుకున్నాను కానీ ప్రభుత్వం ఏ మాత్రం ముందస్తు చర్యలు కానీ కొత్త కరెన్సీ నోట్లను కానీ ముద్రించకుండా సడన్ నిర్ణయం తీసుకుని ఇబ్బందులకు గురిచేస్తుందని అనుకోలేదని చెప్పారు. నోట్లను మార్చుకోవడం కోసం క్యూ లో నిలబడి ఎంతో మంది మరణించారంటు అప్పటి పరిస్థితులను చెప్పి ఇక మరోసారి 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటన గురించి మాట్లాడారు జేపి .

ఈసారి ముందులాగా కాకుండా సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చి మార్చుకోవాలని చెప్పారు. పైగా 2000 రూపాయలను ముద్రణ ఆపేసి చాలా కాలమైందని ఆర్బిఐ చెప్పడం చెలామణి లో కూడా రెండు వేల రూపాయల నోటు ఎక్కువగా కనిపించకపోవడం గమనించవచ్చు . అందుకే ఈసారి నోట్ల రద్దు సామాన్యుడి మీద పెద్దగా ప్రభావం చూపదని చెప్పారు జేపీ. ఇక ఎన్నికలు కోసం ఇదంతా చేస్తున్నారు అన్నది ఊహగనాలు మాత్రమే. కర్ణాటక ఎన్నికల సమయంలో దాదాపు 7వేల కోట్లు ఖర్చయినట్లు సమాచారం. నోట్ల రద్దు వల్ల నల్ల ధనం ఎక్కడ ప్రభుత్వానికి చేరింది. అందుకే నిజాయితీగా చేసిన పనికి ఫలితం దక్కుతుంది అంటూ చెప్పారు.