అక్కడ ఒక్క చికెన్ ముక్కకు రూ.3 వేలు వసూలు చేశారు. అవును మీరు విన్నది నిజమే.. సరదాగా తన ప్రేమికుడితో డేట్ కు వెళ్లిన ఓ యువతి.. ఆ హోటల్ లోనే విందు చేయడానికి కూర్చున్నారు. అక్కడ వాళ్లు ఆర్డర్ చేసిన ఐటెంకు రూ.3 వేల బిల్లు వేసి ఆశ్చర్యానికి గురి చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. లండన్ కు చెందిన రవీన్ అనే యువతి.. తన ప్రియుడితో కలిసి ది షార్డ్‌లోని రెస్టారెంట్‌లో డేటింగ్‌కు వెళ్ళింది. సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దామని ఆమె ఒక డిష్ ఆర్డర్ చేసింది. దానికి రూ.3 వేలు ఖర్చు అయింది.
అయితే దానిని తీసుకొని వచ్చిన తర్వాత ఆమె షాక్ కు గురైంది. అందులో కేవలం ఒక చికెన్ ముక్క, సాస్, ఓ బంగాళదుంప మాత్రమే ఉన్నాయి. ఇంగ్లాండ్ కరెన్సీలో 30 పౌండ్లు అంటే రూ.3 వేలు. అంత ఖర్చు పెట్టి ఆర్డర్ చేస్తే.. కనీసం చిన్న పిల్లలకు కూడా కడుపు నిండని ఐటెం తెస్తారా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఆర్డర్ పెట్టిన ఐటెంను ఫొటో తీసి.. ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
guys look at my £30 meal i got at the shard ???????????? pic.twitter.com/1vj82vG2QE
— R (@raveen__x) August 25, 2021
“గాయ్స్, నా 30 పౌండ్ల భోజనాన్ని చూడండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఎంతో మధురంగా.. ఎన్నో సంవత్సరాల వరకు గుర్తుండిపోయేలా కాలక్షేపం చేయడానికి వస్తే.. ఇలా రెస్టారెండ్ నిర్వాహకులు తీవ్ర అసంతృప్తిని కలిగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.






























