ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడం మనలో చాలామంది కల. చాలా మందిలో కష్టపడే తత్వం ఉన్నా వివిధ కారణాల వల్ల డబ్బు సంపాదించలేక చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. పురుషులతో పోలిస్తే మహిళలు ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసే ఆలోచన ఉన్నా పెట్టుబడి, ఇతర కారణాల వల్ల భయాందోళనకు గురవుతూ వెనుకడుగు వేస్తూ ఉంటారు.

అయితే తక్కువ మొత్తం పెట్టుబడితోనే కళ్లు చెదిరే లాభాలను అందించే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. గృహిణులు ఇంట్లో పిల్లలను బడికి పంపించిన తరువాత బోరింగ్ గా ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే మంచి యాటిట్యుడ్ ఉండి సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ కష్టపడి పని చేసే తత్వం ఉంటే సులువుగా డబ్బులు సంపాదించడం సాధ్యమవుతుంది. డే కేర్ సెంటర్ ద్వారా సులువుగా డబ్బు సంపాదించడం సాధ్యమవుతుంది.
ప్రత్యేక గదులు, పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు, పనివాళ్లు ఉంటే ఈ బిజినెస్ ను సులువుగా చేయడం సాధ్యమవుతుంది. గిఫ్ట్ బ్యాస్కెట్స్ ను తయారు చేయడం ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితోనే ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. మీరు బ్యూటీషియన్ గా సర్టిఫై అయ్యి ఉంటే సులభంగా బ్యూటీ పార్లర్ ను ప్రారంభించవచ్చు. బ్యూటీపార్లర్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
డెకరేటివ్ క్యాండిల్స్ కు సైతం రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. క్యాటరింగ్ బిజినెస్ ద్వారా కూడా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. యూట్యూబ్ లో వంటల వీడియోలు చేయడం, కుకరీ క్లాసెస్, టైలరింగ్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ద్వారా కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు.































