MS Raju : వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్ధంటానా వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో మూడు వరుస ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న ప్రొడ్యూసర్ గా రికార్డు క్రియేట్ చేసిన నిర్మాత ఎమ్ ఎస్ రాజు. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్రాలను తీసి మెప్పించిన ఆయన రామ్ పోతినేని హీరో గా తీసిన మస్కా సినిమా తరువాత కాస్త సినిమాల విషయంలో వెనుకపడ్డాడు. వాన, తూనీగా తూనీగా వంటి ప్లాప్ సినిమాల తరువాత సినిమాలను పెద్దగా చెయ్యలేదు. డర్టీ హరి వంటి ఎక్సప్లిసిట్ కంటెంట్ ఉన్న సినిమాతో వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ అంటున్న రాజు…. చిరు తో సినిమా నో…

తాజాగా రాజు గారు తన సొంత దర్శకత్వంలో కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా పెట్టి సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ అనే సినిమా తీస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. కుటుంబ కథా చిత్రాలు తీసిన రాజు ప్రస్తుతం యూత్ సినిమాల వైపు మళ్ళారు. అలాగే పెద్ద హీరోలతో సినిమాలు తీయనని, చిన్న సినిమాలను నచ్చినట్టు కథలతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఎంతో మంది హీరోలని స్టార్స్ గా చేసిన రాజు ఆయన సినిమాల కోసం ఆయన నిలబెట్టిన హీరోల సహాయాన్ని తీసుకుంటారా అన్న ప్రశ్నకు నేను ఎవరి సహాయం తీసుకోనని చెప్పారు .

ఇక స్టార్ హీరోయిన్ తో గొడవ జరిగిందని పుకార్లపై నాకు తెలియదు అలాంటిదేమీ జరగలేదు అంటూ నాకు నచ్చక పోతే డబ్బు పోయినా పర్వాలేదని సినిమా మధ్యలో ఆపేస్తాను కానీ నచ్చకపోయినా సినిమా తీయనని చెప్పారు. అలా ఒకే సినిమా విషయంలో జరిగిందని సినిమా ఆపేద్దాం అనుకున్న సమయంలో మళ్ళీ సర్దుబాటు జరిగిందని చెప్పారు. కానీ ఆ సినిమా ఏదో మాత్రం చెప్పలేదు. ఇక సంపాదించిన ఆస్తులన్నీ సినిమాల్లోనే పోగొట్టుకున్నానని చెప్పారు. ఒక హీరో మిమల్ని బాగా తిట్టారట కదా అనే ప్రశ్నకు నాకు తెలియదు ఒక వేళ అలా తిట్టుంటే ఈపాటికే అతను డౌన్ ఫాల్ మొదలై ఉంటుందని చెప్పారు. ఇక చిరు లాంటి పెద్ద హీరోతో సినిమా చేస్తారా అన్న ప్రశ్నకు చేయనని ఆ రేంజ్ కాదని, కేవలం ప్రస్తుతం చిన్న సినిమాలను చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.































