M. S. Vikram : తెలుగులో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు ఎంఎస్ నారాయణ. ఆయన నటించిన అనేక సినిమాల్లో పండించిన హాస్యానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 750 సినిమాల్లో నటించిన ఎంఎస్ గారు పెద్ధరాయుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన కొడుకు విక్రమ్ నారాయణ కూడా సినిమాల మీద ఆసక్తితో వచ్చి ‘కొడుకు’ సినిమాతో హీరో అయ్యారు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడం తో హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకకోలేక పోయారు. ఇక తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమ గురించి అలాగే తనకు సినిమాల మీద ఉన్న ఆసక్తి గురించి మాట్లాడారు. ఇక చిరంజీవి గారంటే ఎంతో అభిమానం ఉన్న ఎంఎస్ విక్రమ్ చిరు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

నాన్న చనిపోడానికి కారణం అదే…. చిరంజీవి గొప్పతనం…
ఆకస్మాత్తుగా కమెడియన్ ఎంఎస్ నారాయణ గారు కన్నుమూశారు. అయితే ఆయన మరణించడానికి గల కారణాలను కొడుకు విక్రమ్ చెబుతూ మలేరియా జ్వరం వచ్చినా అది గమనించక పోవడం వల్ల లోపలే ముదిరి చికిత్సకు లొంగకపోవడం వల్ల మరణించారు. మలేరియా వచ్చిన సమయంలో భీమవరంలో ఉన్న ఎంఎస్ నారాయణ గారి వద్ద కుటుంబసభ్యుlu ఎవరైనా ఉండి ఉన్నా చూసుకునేవాళ్ళం అంటూ విక్రమ్ బాధపడ్డారు. ఇక చిరంజీవి గారి గురించి ప్రస్తావన వచ్చి అయన ఎంతో మందికి సహాయం చేశారు, ఒక సారి బ్లడ్ అవసరం అయి నేనే వాళ్ళ బ్లడ్ బ్యాంకు ద్వారా లబ్ది పొందాను.

ఇక నా చిన్నతనంలో చూసాను ఆయనకున్న క్రేజ్ ఏంటో అది ఇప్పటికీ తగ్గలేదు. అలాంటి ఆయనను గరికపాటి గారు అవమానించడమే నచ్చలేదు. అలయ్ బలయ్ కార్యక్రమం అందరూ కలుసుకోడానికి అందునా ఒక ప్రవచన కర్త అలా అహంభావంతో మాట్లాడటమేమిటి, చెప్పే విధానం కుడా ఉంటుంది. చిరంజీవి గారు అక్కడ ఫోటోలు అడిగి తీయించుకోవడం లేదు. అభిమానులు ఆయనతో ఫోటో దిగారు వారిని అనాలి కానీ చిరంజీవి అనడం ఏమిటి అంటూ అభిప్రాయపడ్డారు.


































