అక్టోబర్ 10వ తేదీ జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి మంచు విష్ణు, ప్రకాష్ రాజు తీవ్ర స్థాయిలో ప్రచారం చేసుకుంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ స్పందిస్తూ మంచు కుటుంబం బ్యాలెట్ ఓట్లను దక్కించుకోవాలని కుట్రలు పడుతున్నట్టు ఆరోపించారు.

ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రాజ్ పై కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా తాజాగా మెగా బ్రదర్ నాగబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటినుంచి మెగా బ్రదర్ ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు తెలుపుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నాగబాబు మాట్లాడుతూ పదో తేదీ జరగబోయే మా ఎన్నికల గురించి ఒక విషయం విన్నానని, అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది అంటూ అసలు విషయం బయట పెట్టారు. ఆర్టిస్టులకు మొట్టమొదటిసారి మా డబ్బు ఆశ చూపి ఓట్లు కొనుక్కుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఒక ఓటుకు 10000 డబ్బును ఆశ చూపిస్తున్నారు అంటూ ఈ సందర్భంగా నాగబాబు షాకింగ్ కామెంట్ చేశారు.
Vote ki 10,000/-????????@NagaBabuOffl – @prakashraaj #MaaElections2021 pic.twitter.com/0v4ZA9E7AL
— Ahiteja Bellamkonda (@ahiteja) October 6, 2021
ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పరోక్షంగా మంచు విష్ణు ఆర్టిస్టులను డబ్బుతో కొనుగోలు చేసి గెలవాలని చూస్తున్నట్లు మెగాబ్రదర్ తెలియజేశారు అంటూ పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై నిజానిజాలు తెలియాల్సి ఉందని నాగబాబు తెలిపారు. మరి నాగబాబు వ్యాఖ్యలపై మంచు విష్ణు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.































