రాబోయే రెండు నెలల్లో జరగనున్న మా ఎన్నికల గురించి ఫిలింనగర్ ఇండస్ట్రీలో ఇప్పటినుంచి వేడి వాతావరణం రాసుకుంటుంది.ఈ క్రమంలోనే మా అధ్యక్ష పీఠంపై కొలువుదీరడానికి పలువురు బరిలోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, అదేవిధంగా నటుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ బరిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సిద్ధం చేసి తాను ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు తెలిపారు.

అదేవిధంగా నటుడు మోహన్ బాబు తనయుడు విష్ణు కూడా అధికారికంగా తను మా ఎన్నికల బరిలో దిగబోతునట్లు తెలుపుతూ సినీ కార్మికుల కష్టాలలో వారి వెంటే ఉంటూ వారికి సహాయం చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే ఈ నలుగురి మధ్య పోటాపోటీ భారీగా నెలకొనడంతో మా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే మా అధ్యక్షపీఠం పై కొలువు తీరడం కోసం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు సీవీఎల్ నరసింహారావు ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.సీవీఎల్ నరసింహారావు ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా ఉత్కంఠభరితమైన వాదనతో ఎన్నికలలో నిలబడటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
వృత్తిపరంగా లాయర్ అయినటువంటి సీవీఎల్ నరసింహారావు గారు మా ఎన్నికలలో పోటీ చేయడమే కాకుండా మా సభ్యుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగు కళాకారులకు ప్రస్తుతం తీవ్రమైన అన్యాయం జరుగుతోందనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ వాదంతో తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే సీనియర్ నటి విజయశాంతి మాట్లాడుతూ.. మా ఎన్నికలపై సీవీఎల్ నరసింహారావు అవేదన న్యాయమైనది, ధర్మమైంది. నేను అందులో సభ్యురాలిని కాకపోయినా ఒక కళాకారిణిగా పూర్తి మద్దతు నరసింహారావు గారికే అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

































