దక్షిణాది సినీ పరిశ్రమలో నటుడు ప్రకాష్ రాజ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్నటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మా అధ్యక్షుడు పదవికి పోటీ చేయబోతున్నారు. ఈ ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీ జరుగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ చేసే వారి మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నువ్వా నేనా అంటూ పోటీపడుతూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లు పెట్టి ఇ ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు.ఇక ఎన్నికలు కేవలం నాలుగు రోజులు ఉన్న నేపథ్యంలో ప్రకాష్ ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆలీ ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి గతంలో ఎన్నో సార్లు తనని బ్యాన్ చేసిన టాలీవుడ్ పరిశ్రమకు అధ్యక్షుడు కావడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? రివెంజ్ తీర్చుకోవడం కోసమేనా అంటూ అలీ ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు ప్రకాష్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అసలు ఆ విషయాన్ని ఇప్పుడు మీరు గుర్తు చేస్తే తప్ప నాకు గుర్తు లేదని, నేనెప్పుడో ఈ విషయాన్ని మర్చిపోయానని ప్రకాష్ తెలియజేశారు. ఈ క్రమంలోనే తనని సినీ పరిశ్రమ బ్యాన్ చేయడానికి కారణాలు కూడా వివరించారు. ఒకసారి సినిమా సెట్లో ఓ మహిళను ఒక వ్యక్తి రాళ్లతో దాడి చేస్తుంటే ఏంటిది అని తనని తోశాను దీంతో తనపై చేయి చేసుకున్నారని కేసు వేయడంతో ఇండస్ట్రీ బ్యాన్ చేసిందని,అదేవిధంగా ఆగడు సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశంలో భాగంగా దర్శకుడు శ్రీను వైట్లతో విభేదించడం వల్ల తనని రిజెక్ట్ చేసి మరుసటి రోజు నా స్థానంలో సోనుసూద్ ను తీసుకున్నారని ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాష్ రాజ్ తెలియజేశారు.


































