Madhavi Latha: బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలో సెలబ్రెటీలుగా కొనసాగుతూ మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఆరు సీజన్లను పూర్తి చేసుకొని ఏడవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.

ఈ కార్యక్రమం మరికొద్ది రోజులలో ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సినీ నటి మాధవి లత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Madhavi Latha: మూడు సీజన్లుగా అవకాశం వస్తూనే ఉంది…
ఈమె గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా నటి మాధవి లత స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తనకు బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం రావడం ఇది మొదటిసారి కాదని గత మూడు సీజన్ల నుంచి వరుసగా నిర్వహకులు తనని సంప్రదిస్తున్నారని తెలిపారు. అయితే వ్యక్తిగతంగా నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇష్టం లేదు అయినా బిగ్ బాస్ నిర్వాహకులు తనని సంప్రదించినందుకు ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా ఈమె ఈ కార్యక్రమంలో పాల్గొనలేదంటూ క్లారిటీ ఇచ్చేశారు.



























