Mahesh Babu: దేనినైనా గుడ్డిగా నమ్మి ముందుగా వెళ్ల కూడదు. అది జీవితానికి సంబంధించిన విషయం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సినిమాల విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి లేదంటే.. ఆ సినిమా ప్లాప్ ను మూటకట్టుకుంటుంది.

ఇదే అనుభవం సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాంత్ అడ్డాల సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా మహేష్ కు.. ఇటు విక్టరీ వెంటకేష్ కు మరపురాని హిట్ ను అందించాడు.

అయితే ఈ సినిమా అయిపోయిన తర్వాత.. శ్రీకాంత్ అడ్డాల.. మహేష్ బాబుకు తన దగ్గర మరో కథ ఉందని.. అది కూడా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా అని చెప్పాడట. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటూ చెప్పడంతో.. ఆ సినిమా కథ వినకుండానే అతడు ఒప్పుకొని సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారట.
అయితే సినిమా షూటింగ్ దాదాపు సంగం కంటె ఎక్కువగా అయిపోయిన తర్వాత మహేష్ కు సినిమా కథ కాస్త.. డిఫరెంట్ గా అనిపించిందట. అప్పుడు శ్రీకాంత్ అడ్డాలను పిలిచి కథ చెప్పమని అడిగాడట. ఆ కథ విని అతడిపై సీరియస్ అయ్యాడట.
బ్రహ్మోత్సవం సినిమా ప్లాప్ అవుతుందని..
అప్పుడే బ్రహ్మోత్సవం సినిమా ప్లాప్ అవుతుందని మహేష్ బాబు అనుకున్నారట. అయితే సినిమా దాదాపు ఎండిగ్ స్టేజ్ లో ఉండటంతో.. ఎలాగోలా పూర్తి చేశారట. 2016 మే 20న విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ అనుకున్నట్లే సినిమా ప్లాప్ ను మూటగట్టుకుంది. దీంతో మహేష్ బాబు..ఆ సినిమా తర్వాత కథల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారంటూ సినీ వర్గాల నుంచి టాక్.































