మహేశ్ బాబు ఫ్యాన్స్ అత్రుతగా ఎదురు చూస్తున్న ‘సూపర్‌స్టార్ బర్త్‌డే బ్లాస్టర్’ వచ్చేసింది. ప్రిన్స్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ఇచ్చాడు. ‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్ వీడియోను తాజాగా విడుదల చేశారు.

అనుకున్న టైం కంటే ముందే మైత్రి మూవి మేకర్స్ ఈ వీడియోను విడుదల చేశారు. మహేష్ అభిమానులకు అదిరిపోయే ట్రిట్ ఇచ్చారు. ఈ వీడియాలో మహేష్ మరింత యంగ్‌గా కనిపిస్తున్నాడు. ఆయన చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌లు అభిమాలను అలరిస్తున్నాయి.
ఇక బ్యాంకింగ్‌లో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది.
































