Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. అయితే మహేష్ బాబు సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలను కూడా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన నిర్మాతగా కూడా సినిమాలను నిర్మించడమే కాకుండా ఏషియన్ వారితో కలిసి హోటల్ బిజినెస్ అలాగే మల్టీ ఫ్లెక్స్ థియేటర్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా వీటి ద్వారా భారీ స్థాయిలో లాభాలను కూడా అందుకుంటున్నారు. సినిమాల ద్వారా డబ్బు సంపాదించి వాటిని బిజినెస్ లో పెట్టుబడి పెట్టడం బిజినెస్ ద్వారా కోట్లలో ఆదాయం పొందడం జరుగుతుంది.
ఈ విధంగా మహేష్ బాబు భారీగా సంపాదిస్తున్నప్పటికీ దానిలో కొంత భాగం మహేష్ బాబు ఫౌండేషన్ కోసం ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ ద్వారా మహేష్ బాబు ఇప్పటికే వేల సంఖ్యలో చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించి వారికి పునర్జన్మ అందించడమే కాకుండా బుర్రపాలెం దత్తత తీసుకొని గ్రామంలో మౌలిక సదుపాయాలు అన్నిటిని కూడా సమకూరుస్తూ ఉన్నారు.
లండన్ లో కూడా ఆస్తులు…
ఈయన వెండితెరపై మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు. ఇలా ఒక వైపు సినిమాలు మరోవైపు బిజినెస్ అంటూ ఈయన భారీగానే సంపాదిస్తున్నారు సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడా పెట్టారనే తెలుస్తుంది. కోట్ల విలువ చేసే కార్లు బంగ్లాలు ఉన్నాయి. కేవలం హైదరాబాదులోనే కాకుండా బెంగళూరులో కూడా కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది అయితే ఈయన ఇండియాలోనే కాకుండా లండన్ లో కూడా ఆస్తులు కొనుగోలు చేశారు అంటూ ఇదివరకు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.




























